సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆడ పిల్లలు హెచ్ పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా టీకా అధికారి ప్రవీణ్ కుమార్

47 నిమిషాల క్రితం

Girls should avail the benefits of the HPV vaccine: District Immunization Officer Praveen Kumar.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ఆడ పిల్లలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్ పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా టీకా అధికారి డాక్టర్ జె.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డాక్టర్ జె.ప్రవీణ్ కుమార్ హెచ్ పివి టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందన్నారు.జిల్లాకు 9వేల డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్టోబర్ 7వరకు హెచ్ పివి వ్యాక్సిన్ ఉచితంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేస్తున్నామన్నారు. 56 మంది పిల్లలకు హెచ్ పివి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు.అనంతరం సర్టిఫికెట్ అందజేశారు. ఆడ పిల్లలు వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరిష్మా,హెల్త్ ఆఫీసర్లు మునిరెడ్డి, ప్రసాద్ యాదవ్,సూపర్ వైజర్లు రామారావు, శివగంగ, ల్యాబ్ టెక్నీషియన్ జాసన్, సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్