ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : పోషకాలు కలిగిన పౌష్టికాహారం తీసుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరమని సిడిపిఒ ఓబుళమ్మ తెలిపారు. ముద్దనూరు -1,ఎస్సి -1-2 అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం సిడిపిఒ ఆధ్వర్యంలో సూపర్ వైజర్ భారతి అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. సిడిపిఒ మాట్లాడుతూ .... చిన్నారుల పోషణ ఆరోగ్యం అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. పిల్లలు ఎదుగుదలకు సమతుల్యమైన వైవిద్యమైన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన,మిషన్ వాత్సల్య పథకాలపై తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రంలో అక్టోబర్ 7 వరకు అంగన్వాడి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్మలజ్యోతి, రామలక్షుమ్మ, గంగభవాని, వీరలక్ష్మి, విజయదుర్గ, విజయ పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో తల్లి, బిడ్డకు ఆరోగ్యం
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)