- విజయవాడ మేయర్‌గా రాధాకృష్ణ
- కడపలో సువర్ణ, తిరుపతిలో శ్రీనివాస్ ప్రమాణం
- విశాఖలో ప్రమాణ స్వీకారానికి హాజరుకాని శ్రావణి
ప్రజాశక్తి - యంత్రాంగం : ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మేయర్, ఆపై కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 13 కార్పొరేషన్లలో 12 చోట్ల మేయర్లు ప్రమాణ స్వీకారం చేయగా, వ్యక్తిగత కారణాలతో (తండ్రి మరణం వల్ల) విశాఖపట్నం మేయర్ అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు.
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్‌గా కాంతి శ్రీని ఎన్నుకున్నారు. మచిలీపట్నం మేయర్‌గా అబ్దుల్ అబీదా ప్రమాణం చేయగా డిప్యూటీ మేయర్‌గా వెంకట్రావ్ ఎన్నికయ్యారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా అవనాపు భార్గవి, డిప్యూటీ మేయర్‌గా ప్రసాదుల రజని బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణం పూర్తయిన వెంటనే వైసిపి కార్పొరేటర్లు, కొంతమంది జనసేన కార్పొరేటర్లు సభ నుంచి వెళ్లిపోయారు. తిరుపతి మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా పాలడుగు విజయ ప్రమాణస్వీకారం చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ ఎ.గోపీనాథ్, నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ గా పి రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ గా కె.రఘునాధరాజు ప్రమాణస్వీకారం చేశారు. కర్నూలు మేయర్‌గా మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష ప్రమాణం చేశారు. డిప్యూటీ మేయర్‌గా బిజెపి కార్పొరేటర్ అంబలి కాశీ విశ్వనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప, డిప్యూటీ మేయర్‌గా చావలి చార్పిత బాధ్యతలు చేపట్టారు. కడప నగర పాలక సంస్థ సమావేశ భవనంలో మేయర్‌గా మట్లి సువర్ణ, డిప్యూటీ మేయర్‌గా మన్సూర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతపురం మేయర్‌గా రమేష్‌గౌడ్, డిప్యూటీ మేయర్‌గా స్వప్న, గుంటూరు మేయర్‌గా లక్ష్మి అపర్ణ, డిప్యూటీ మేయర్‌గా రాజేష్, ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు ప్రమాణం చేయగా డిప్యూటీ మేయర్‌గా నాయుడు శారదను ఎన్నుకున్నారు.









కామెంట్‌లు (0)