ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నకిలీ మద్యం అవాస్తవం

25 సెప్టెంబర్, 2026

exesi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎక్సైజ్ శాఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మంగళగిరి లిక్కర్ మార్ట్‌లో విక్రయించిన బ్లెండర్స్ ప్రైడ్ బాటిల్ నకిలీదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. వైరల్ వీడియోలో వ్యక్తి బాటిల్ క్యాప్ పై ఉన్న వెరిఫికేషన్ క్యూఆర్‌ కోడ్ ను కాకుండా, ఎపి ఎక్సైజ్‌ ‌సురక్షా యాప్ ఇన్ స్టాలేషన్ క్యూఆర్‌ కోడ్ ను స్కాన్ చేయడం వల్లే ఎర్రర్ వచ్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ ఇన్‌‌స్టాల్‌ ‌చేసుకున్న ఫోన్‌ ‌నుంచి ఇన్ స్టాలేషన్ కోడ్ ను మళ్లీ స్కాన్ చేస్తే ‘క్యూఆర్‌ ‌నాట్‌ ‌ఫౌండ్‌ లేక ఎర్రర్‌’ వస్తుందని, దాన్ని నకిలీకి ఆధారంగా చూపడం తప్పు అని స్పష్టం చేశారు. బాటిల్ అసలైనదో కాదో తెలుసుకోవాలంటే బాటిల్ క్యాప్ లేబుల్ పై ఉన్న వెరిఫికేషన్ క్యూఆర్‌ కోడ్‌ను సురక్షా యాప్ ద్వారా స్కాన్ చేయాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్