సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ ఉదృతికి కొట్టుకుపోయిన కుటుంబం

1 గంట క్రితం

veligonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టన్నెల్స్ నుండి నీటిని ఆపి నిర్వాసితుల ప్రాణాలను రక్షించాలి

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్

మార్కాపురం: మార్కాపురం జిల్లా కల్నూతల గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటి ఉదృతికి ఓ కుటుంబం వాహనంతో సహా కొట్టుకుపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు, మరో ఇద్దరు చెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్నట్లు సమాచారం వస్తోందని ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో పరిహారం అందక చివరి వరకు ఎదురుచూసిన కుటుంబం, నిరాశతో గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లే క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

టన్నెల్స్ నుంచి నీటిని నిలిపివేసి నిర్వాసితుల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ముందుగా తగిన ఏర్పాట్లు చేసి నిర్వాసితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతే టన్నెల్స్ నుంచి నీటిని విడుదల చేయాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిహారం అందక పెండింగ్‌లో ఉన్న 31 పేర్లను ప్రకటిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగానే కనీసం పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాను ప్రకటించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్