సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టుల బేరసారాలు

54 నిమిషాల క్రితం

sajjala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రశ్నిస్తే ‘యువగళం’ గూండాలతో దాడులు

- శాప్ వద్ద వైసిపి శ్రేణులపై దౌర్జన్యాన్ని ఖండించిన సజ్జల

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌‌సి స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులను ముంచి, పోస్టులను బరితెగించి అమ్ముకున్న కూటమి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తే ‘యువగళం’ గూండాలతో దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్యని వైయస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా వినతిపత్రం ఇచ్చేందుకు ముందే సమాచారం ఇచ్చినా నిరాకరించిన పోలీసులు, మరోవైపు శాప్ కాంపౌండ్‌లోనే స్పోర్ట్స్ కోటా టీచర్లకు టెంట్లు, మైకులు వేసి రక్షణ కల్పించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల సమక్షంలోనే టిడిపి గూండాలను రప్పించి తమ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడటం ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దాడేనని, ఈ దారుణాలపై కూటమి సర్కారు ప్రజలకు సమాధానం చెప్పితీరాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్‌‌సి నియామకాల్లో భారీగా అక్రమాలు, పోస్టుల బేరసారాలు జరిగాయన్నది నిజమని స్పష్టం చేశారు. 3.5 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్‌‌ను కాలరాస్తున్న విధానాలపై మేధావులు, ప్రజా సంఘాలు, బాధితులు ఏకమై గళమెత్తాలని కోరారు. రాష్ట్రంలో నియంతల పాలన సాగుతోందని విమర్శించారు. సక్రమంగా, మెరిట్ ఆధారంగా ఎంపికైన నిజాయితీపరులకు మేము వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్