శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూ పరిహారం కోసం రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

16 నవంబర్, 2026

భూ పరిహారం కోసం రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆందోళన

ప్రజాశక్తి- రేగిడి (విజయనగరం జిల్లా) : భూములు కోల్పోయినా.. పరిహారం అందకపోవడంతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా రేగిడి మండలంలో సోమవారం కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఉంగరాడమెట్ట పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న చిన్నతరహా పరిశ్రమల కోసం ఆర్ ఆముదాలవలస గ్రామానికి చెందిన దళితుల వద్ద 25.75 ఎకరాల భూమిని 23 మంది రైతుల నుంచి రెవెన్యూ అధికారులు భూ సేకరణ చేశారు. అందులో కుమిలి అప్పయ్య కుటుంబానికి చెందిన 1.30 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల రైతుల వద్ద నుంచి ఖాళీ చెక్కులపై సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. వారిలో అప్పయ్య కుటుంబం సంతకాలు చేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 22 మందికి రూ.ఐదు లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. అప్పయ్య కుటుంబానికి మాత్రం జమకాకపోవడంతో ఆయన కుమారులు సింహాచలం, శ్రీనివాసరావు, రవి సోమవారం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడున్నవారు అప్రమత్తమై వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై తహశీల్దార్‌ ‌బి ఈశ్వరరావు మాట్లాడుతూ రైతులు బ్యాంకు ఖాతా ద్వారా పరిహారం పొందాలని, బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూములను సేకరించామని, ఆందోళన విరమించాలని కోరారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్