మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిలిచిన పంటు ప్రయాణం.. ప్రయాణికుల ఇక్కట్లు

13 గంటల క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సఖినేటిపల్లి : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా సఖినేటిపల్లి రేవు నరసాపురం మధ్య మంగళవారం పంటు ప్రయాణం నిలిచిపోయింది. గత రెండు రోజులుగా అధికారులు పంటుని నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు వెళ్లేందుకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిరేవు మీదుగా పంటులో ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా పంటుపై కార్లు, ద్విచక్ర వాహనాలు సైతం చేరవేస్తారు. వశిష్ట గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ వరద పోటు ఉండటంతో ముందుస్తూ భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు పంటు సేవలు నిలిపివేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్