ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె.పల్లెపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వలలు కాలిపోయి సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తిని నష్టపోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్ని ప్రమాదం.. 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసిందని పేర్కొన్నారు. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని మత్స్యకారులు చెబుతున్న మాటలను తనను కలచివేశాయని, వారిని ఈ ప్రభుత్వం ఆదుకోకపోతే వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి : జగన్
18 నవంబర్, 2026
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)