ఇద్దరు అరెస్ట్
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖ) : పుష్ప సినిమా తరహాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు విశాఖలో భగ్నం చేశారు. రూ.8.98 కోట్ల విలువైన 5,832.90 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు రహస్య సమాచారం అందడంతో విశాఖలో డిఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంగారాన్ని తరలిస్తున్న కారును హైవేపై ఛేజ్ చేసి శనివారం అర్ధరాత్రి పట్టుకున్నారు. కారు సీటు కింద ప్రత్యేకంగా రూపొందించిన రహస్య క్యాబిన్‌లో దాచిన బంగారాన్ని కస్టమ్స్ చట్టం కింద సీజ్ చేశారు.
ఇద్దరిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని చేరవేసే స్మగ్లింగ్ వ్యవస్థలో భాగంగా ఈ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. డిఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)