సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅధునాతన పరిశోధనలపై దృష్టి..

1 గంట క్రితం

అధునాతన పరిశోధనలపై దృష్టి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • యువ వైద్యులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచన

  • ఘనంగా డాక్టర్‌ ఎన్‌‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూబీ జూబ్లీ వేడుకలు

​ప్రజాశక్తి– విజయవాడ అర్బన్/తిరుమల : వైద్య విద్యతో పాటు అధునాతన పరిశోధనలపై దృష్టి సారించాలని, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్‌ యువ వైద్యులకు సూచించారు. వైద్య వృత్తిలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మానవీయ విలువలు, రోగుల పట్ల ఆప్యాయతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎన్‌‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూబీ జూబ్లీ వేడుకలు విజయవాడలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కళా వేదికలో సోమవారం డాక్టర్‌ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యూనివర్సిటీ 40 ఏళ్ల ప్రగతి బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో వైద్య విద్య విస్తరిస్తోందన్నారు. దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్‌‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి భవిష్యత్తులో నోబెల్‌ బహుమతి గ్రహీతలు రావాలని ఆకాంక్షించారు. వైద్య పరిశోధనల్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలన్నారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఎఐ), డిజిటల్‌ హెల్త్‌ ప్రాధాన్యం పెరుగుతోందని, వాటిని సమర్థంగా వినియోగించుకో వాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ స్వాగతోప న్యాసం చేస్తూ... కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ నందమూరి తారక రామారావు దూరదృష్టితో 1986లో దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా ఈ సంస్థ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. గత నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్యారంగంలో విశ్వవిద్యాలయం విశేష ప్రగతి సాధించిందని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. వైద్య పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్ల నిధులు కేటాయించామని, వైద్య రంగంలో వస్తోన్న ఆధునిక మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంకె.రమేష్‌ మాట్లాడుతూ వైద్య రంగంలో ఆధునిక సాంకేతికతను సమర్థ వంతంగా వినియోగించుకుంటూనే మానవీయ విలువలు, సానుభూతి, నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చే అంతర్జాతీయస్థాయి వైద్యులను తీర్చిదిద్దాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో రాష్ర్ట గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు వచ్చిన ఉపరాష్ట్రపతికి గన్న వరం అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్ సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టిటిడి ఇఒ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఇఒ సిహెచ్.వెంకయ్య చౌదరి, సివిఎస్వో మురళీకృష్ణ సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్