బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణ స్థానిక సంస్థలకు బలవంతపు రుణాలు..

02 అక్టోబర్, 2026

tax
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కచ్చితంగా తీసుకోవాల్సిందేనంటూ నిబంధనలు

- యూజర్‌‌ఛార్జీలు, టాక్సులు పెరిగే ప్రమాదం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పట్టణ స్థానిక సంస్థల్లో నాన్‌ ‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ‌కార్పొరేషన్‌, బాండ్లు, ఇతర మార్గాల్లో రుణాలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌ అండ్‌ అసెట్‌ ‌మేనేజ్‌‌మెంట్ లిమిటెడ్‌ (ఎపియుఐఎఎంఎల్‌)‌ను నియమించింది. అప్పులు తీసుకునేందుకు అర్హత ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు నిధులు ఇప్పించడం, అర్హతలేని స్థానిక సంస్థలను రెండు లేదా అంత కంటే ఎక్కువ సంస్థలను కలిపి రుణాలు తీసుకునే విధంగా ఈ సంస్థ చూస్తుంది. ఇప్పటి వరకూ స్థానిక సంస్థలు రుణాలు తీసుకుంటే ప్రభుత్వాలు కొంత గ్యారంటీ ఇచ్చేవి. ఇక ముందు అటువంటి గ్యారంటీ ఏమీ ఇవ్వదు. అర్బన్‌ ‌ఛాలెంజ్‌ ‌ఫండ్‌(యుసిఎఫ్‌)‌లో భాగంగా ఆయా స్థానిక సంస్థలు కచ్చితంగా రుణాలు తీసుకోవాలి. తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో చెల్లించాల్సిందే. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తుండటంతో స్థానిక సంస్థలకు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి ఉండటం లేదని, ఆర్థికంగా ఆయా సంస్థలు నిలదొక్కుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ కావాలని, అప్పు తీసుకుని పనులు చేయడం ద్వారా వాటిని తిరిగి చెల్లించేందుకు వీలుగా ప్రజల నుండి ఫీజులు వసూలు చేసుకోవాలని నిబంధనల్లో పెట్టారు. తీసుకున్న అప్పును చెల్లించేందుకు ఎస్ర్కో ఎకౌంట్‌ ఓపెన్‌ ‌చేయాల్సి ఉంటుంది. రుణం, వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రతినెలా పన్నులు, యూజర్‌ ‌ఛార్జీలన్నీ ఈ అకౌంట్లో జమచేయాల్సి ఉంటుంది. చెల్లించేవాటాకు సరిపోయిన తరువాతే స్థానిక సంస్థలు వాడుకోవాల్సి ఉంటుంది. గతంలో జెఎన్‌ఎన్‌‌యుఆర్‌ఎంలో అమలు చేసిన ఇలాంటి పద్దతిని ఇప్పుడు యుసిఎఫ్‌‌లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.

‌యూజర్‌ ‌ఛార్జీలు పన్నులు పెంచే ప్రమాదం

పట్టణ స్థానిక సంస్థలు ఎన్‌బిఎఫ్‌‌సి, బ్యాంకులు, బాండ్ల ద్వారా రుణాలు సేకరించడం వల్ల నగరవాసులపై ప్రత్యక్ష, పరోక్ష రూపంలో తీవ్ర ఆర్థిక భారం పడనుంది. తాగునీరు, డ్రైనేజీ, రవాణాకు సంబంధించిన ఖర్చులన్నీ ప్రజల నుండే యూజర్‌ ‌ఛార్జీల రూపంలో వసూలు చేయనున్నారు. స్థిరమైన ఆదాయ వనరులు పేరుతో ఆస్తి పన్నులు, నీటి కనెక్షన్ చార్జీలు, చెత్త సేకరణ ఛార్జీలూ పెంచనున్నారు. అన్ని రకాల మున్సిపల్‌ ‌సేవలకూ ఛార్జీలు వసూలు చేయనున్నారు. అప్పులు చెల్లించాల్సిన నేపథ్యంలో అనివార్యంగా స్థానిక సంస్థలన్నీ పన్నుల భారాన్ని పెంచక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు. రుణాలు తెచ్చి చేపట్టిన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోయినా ప్రైవేటు ఏజెన్సీల అప్పులు గనుక రుణ వాయిదాలు ఆపేందుకు వీలుండదు. నెలనెలా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేయనున్నారు. దీంతోపాటు రుణాలు లేదా బాండ్లు సమీకరించే క్రమంలో ఎపియుఐఎఎంఎల్‌ వంటి సంస్థలకు చెల్లించే ఫీజుల భారం కూడా అప్పుల్లో కలపనున్నారు. ఎంత ఎక్కువ అప్పు తీసుకుంటే అంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. రూ.500 కోట్ల వరకూ రుణం తీసుకుంటే 0.50 శాతం, రూ.500 కోట్లకు పైబడి రూ.1,000 కోట్ల వరకూ 0.30 శాతం, రూ.1,000 కోట్లకు పైబడి 0.20 శాతంతోపాటు జిఎస్‌‌టి కూడా ఎపియుఐఎఎంల్‌ ‌సంస్థకు చెల్లించాలి. ఈ భారాన్ని కూడా ప్రజల నుండే వసూలు చేయనున్నారు. దీనిపై ఇటీవల ఉత్తర్వులు కూడా ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్