ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు

09 నవంబర్, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – చాగల్లు: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం నుంచి చాగల్లు డిక్షనరీ ఫ్యాక్టరీ రోడ్డు వైపు కారులో వెళ్తున్న నలుగురు వ్యక్తులు వరద ప్రమాదంలో చిక్కుకున్నారు. కాలువ వంతెనపైకి వచ్చిన వరద నీటిలో కారు ఆగిపోవడంతో వారు వెంటనే కారు దిగి కాపవరం వైపు వెళ్లి తమ గ్రామానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం కాలువలో ఉన్న కారును భారీ యంత్రం సహాయంతో బయటకు తీశారు. నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, 1986లో వచ్చిన వరదల మాదిరిగా ప్రస్తుతం కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తోందని తెలిపారు. వరద నీటిలో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తూ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో స్థానికులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు వినకుండా వరద నీటిలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. వరదలు ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు ప్రవహిస్తున్న రహదారులపై ప్రయాణించవద్దని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్