ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్యాస్ బొలెరో వ్యాన్ టైరు పగిలి బోల్తా

12 నవంబర్, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 10:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇద్దరికి గాయాలు

ప్రజాశక్తి – బత్తలపల్లి : అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గ్యాస్ సిలిండర్లతో వస్తున్న హెచ్‌పీ గ్యాస్ బొలెరో వాహనం టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం నుంచి ఫుల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు బత్తలపల్లి వైపు వస్తున్న బొలెరో వాహనం తహసీల్దార్ కార్యాలయం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా టైరు పగిలింది. దీంతో అదుపుతప్పిన వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్