ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వైట్ గట్ లక్షణాలపై ప్రభుత్వం అప్రమత్తం

04 జులై, 2026

atchennaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వ్వవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలపై రాష్ట్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని వ్వవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని నమోదిత, నమోదుకాని హేచరీలు, ప్రైవేట్ ఆక్వా ల్యాబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నాణ్యతలేని విత్తనం, నాసిరకం ఫీడ్ విక్రయాలు, తప్పుడు ల్యాబ్ నివేదికలు, నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని తెలిపారు. అన్ని జిల్లాల్లోని మత్స్యశాఖ అధికారులు ఏడు రోజుల్లోగా తనిఖీలు, నమూనాల సేకరణ, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని తెలిపారు. రైతులకు అవగాహన కల్పించడంలో, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని పేర్కొన్నారు. రొయ్యల రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్