గుడివాడ (కృష్ణా) : కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణను వీఆర్‌కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీలో అక్రమాల పేరుతో ఈనెల 10న గుడివాడ పట్టణంలో వైసిపి నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్‌ఐ సత్యనారాయణ అందించారు. అయినా.. కొడాలి నాని పోలీసుల ఆదేశాలు ధిక్కరించి వైసిపి శిబిరం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిమాణాల్లో కొడాలి నానితో ఎస్‌ఐ చనువుగా మెలిగారనే ఆరోపణతో వీఆర్‌కి పంపినట్లుగా సమాచారం.
గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐపై బదిలీ వేటు
12 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)