ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు భాషకు వన్నెతెచ్చిన మహాకవి గురజాడ

58 నిమిషాల క్రితం

gurajada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌

- ఘనంగా గురజాడ అప్పారావు, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి

ప్రజాశక్తి - నంద్యాల : తెలుగు భాషకు వన్నెతెచ్చిన మహాకవి గురజాడ అప్పారావు అని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ పేర్కొన్నారు. మహాకవి గురజాడ అప్పారావు, శతాధిక గ్రంథాల రచయిత గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని నంది రైతు సమాఖ్య కార్యాలయంలో ఆదివారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్‌ రవీంద్రనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కెంగార మోహన్‌ మాట్లాడుతూ వర్తమాన కవులకు అడుగుజాడ గురజాడ అని వివరించారు. ఆయన రచనల్లోని సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మాతృభాష పట్ల అభిమానం పెంపొందించడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ‘తెలుగు భాషా వైభవం’ అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కెంగార మోహన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్