శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టిన ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు

06 అక్టోబర్, 2026

bapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - బాపట్ల : ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. మంగళవారం ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయ ప్రాంగణం బయట తమ న్యాయమైన డిమాండ్ల కోసం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులతో ధర్నా నిర్వహించారు. వందలాది మంది ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యుడు సత్యంరాజు కూరపాటి మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో విధులు బహిష్కరించి సమ్మెకు దిగాల్సి వచ్చింది అన్నారు. కనీస వేతనం నూరు శాతం గ్రాస్ రూపంలో అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగులనురెగ్యులర్ చేయాలన్నారు. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్,ఎంప్లాయిస్ హెల్త్ కార్డు ఇవ్వాలి. బదిలీలను వెంటనే అమలు చేయాలి .ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో జిల్లాలో పీహెచ్సీలు, సిహెచ్ లు , ఏరియా ఆసుపత్రుల స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్