ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

6 రోజుల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 20 తేదీన తీరాన్ని తాకనున్న తీవ్ర తుఫాను

- ముందస్తు జాగ్రత్తలపై సిఎం చంద్రబాబు ఆదేశాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోస్తాంధ్ర తీరాన్ని ఈ నెల 20 తేదీన తుఫాను తాకనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రానున్న తుఫాను కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపటంతో పాటు విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని సిఎం సూచించారు. అలాగే భారీ వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్