బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Rains: తిరుమలలో భారీ వర్షం

1 గంట క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో మోస్తరు వాన

ప్రజాశక్తి - యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పాటు భారీ వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి అధికారులు సూచించారు. నాయుడుపేట అత్యధికంగా 18.2 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. మంగళవారం రాత్రి నుంచి ముసురు కురుస్తూనే ఉండడంతో అర్బన్‌‌లో ఉన్న పలు అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జిలు నీట మునిగాయి. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా తిరుమలలో కొండకు ఆనుకొని ఉన్న శివ జ్యోతి నగర్, ఎర్ర మెట్ట, పోస్టల్ కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఎక్కడ చూసినా వర్షపు నీటితో పాటు మురుగునీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జలాశయలకు నీరు చేరుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలో శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పాటే అవకాశం ఉందని ఎపిఎస్‌‌డిఎంఎ హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్