శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌టేకు వృక్షాభివృద్ధిలో అటవీశాఖ చారిత్రాత్మక విజయం

4 గంటల క్రితం

Must be careful: Deputy CM Pawan condemns remarks against Minister Anita.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 08:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో​ : టేకు వృక్షాభివృద్ధి రంగంలో ఏకకాలంలో మూడు మెరుగైన క్లోన్లను సృష్టించి రాష్ట్ర అటవీశాఖ చారిత్రాత్మక విజయం సాధించిందని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్‌‌కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా అటవీశాఖ పరిశోధనా విభాగం సాగించిన నిరంతర పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు. దేశంలోనే తొలిసారి ఈ అరుదైన ఘనత సాధించిన రాష్ట్ర అటవీశాఖ పరిశోధనా విభాగం, పిసిసిఎఫ్‌, పరిశోధకులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ‌శుక్రవారం ఒక ప్రకటనలో అభినందించారు. రూపొందించిన మూడు టేకు క్లోన్లు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన నిరంతర పరిశోధన, మొక్కల ఎంపిక, క్షేత్రస్థాయి పరీక్షలు, శాస్త్రీయ మదింపు ఫలితంగా రూపుదిద్దుకున్నాయని వివరించారు. ఇందులో ఎపిఎఫ్‌‌డి-ఐడబ్ల్యూఎస్‌‌టి-టిజి-1 క్లోన్‌ను నర్సీపట్నం అటవీ ప్రాంతంలోని గుడిమర్రిపాకలలో అభివృద్ధి చేశారని వెల్లడించారు. 1972లో ప్రారంభమైన ఈ పరిశోధనా ప్రస్థానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. ఈ మెరుగైన టేకు క్లోన్లు భవిష్యత్తులో కలప ఉత్పాదకత పెంపునకు, రైతులు, కలప సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు దోహదపడతాయని వివరించారు. అలాగే శాస్త్రీయ పద్ధతుల్లో అటవీ వనరుల అభివృద్ధికి, స్థిరమైన అటవీ నిర్వహణకు ఈ పరిశోధనలు తోడ్పడతాయని ఆకాంక్షించారు. ఈ విజయంలో భాగస్వాములైన ఐసిఎఫ్‌ఆర్‌ఇ – ఐడబ్ల్యూఎస్‌టి శాస్త్రవేత్తలను అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్