తాడిపత్రి (అనంతపురం) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. లారీ క్యాబిన్ వెనుక భాగంలో కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌ను గుర్తించిన పోలీసులు.. అందులో భారీగా మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 400 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లారీకి రెండు నంబర్ ప్లేట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఒకటి కర్నాటక రాష్ట్రానికి చెందిన నంబర్ ప్లేట్ కాగా.. మరొకటి ఎపి నంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించారు. తాడిపత్రి పట్టణ సిఐ ఆరోహణరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టి లారీతోపాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.
లారీలో భారీగా గోవా మద్యం
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)