మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆప్‌ ఎమ్మెల్యే అక్రమనిర్బంధంపై పిటిషన్‌ విచారణకు అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు

1 గంట క్రితం

delhi hc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఆప్‌ ఎమ్మెల్యే కుల్దీప్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలన్న సీనియర్‌ న్యాయవాది షాదన్‌ ఫర్సాత్‌ అభ్యర్థన మేరకు చీఫ్‌ జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ నేడు విచారణకు అంగీకరించారు. మంగళవారం తెల్లవారుజామున మఫ్టీలో వచ్చిన సుమారు 20మందికి పైగా పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆప్‌ ఢిల్లీ యూనిట్‌ చీఫ్‌ సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుడి మృతికి ఢిల్లీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పారిశుధ్యకార్మికులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా నిరసన చేపడుతున్న కుల్దీప్‌ కుమార్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని అన్నారు. ఆయనను పోలీస్‌ స్టేషన్‌కి బదులుగా ఆయనను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారని అన్నారు. కళ్యాణ్‌పురిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుడిని హత్య చేశారని అన్నారు. గత రెండు రోజులుగా అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్మికులు ఆందోళన చేపడుతున్నారని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్