మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల కోసం దరఖాస్తులు

1 గంట క్రితం

w.godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 04:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యద్దనపూడి : యద్దనపూడి మండలంలో 2026-27 విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ 1, 2026 నుండి ఏప్రియల్ 30, 2026 వరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ లుగా పని చేయుటకు తగిన అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. జి. కె.& యం.కె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పూనూరు లో ఒక బయాలజి ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గన్నవరం లో ఒక బయాలజీ , పి. యస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలూరు లో ఒక బయాలజీ, ఒక ఫిజికల్ సైన్స్ మొత్తం నాలుగు పోస్టులకు దరఖాస్తులు కోరడమైనది. అర్హత కల్గిన అభ్యర్దులు తమ అప్లికేషన్స్ పూర్తి చేసి ఈ నెల 21లోపు మండల విద్యాశాఖాధికారి కార్యాలయమునకు పంపవలసిందిగా యద్దనపూడి యం. ఇ. ఒ లు పుల్లెల సుబ్రహ్మణ్యేశ్వర రావు చిలుకూరి గోపీ కోరారు. ఎంపిక అయిన వారికి నెలకు12,500 రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్