ప్రజాశక్తి - కాకినాడ : కాకినాడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎంల గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, రెవిన్యూ పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈవీఎంలు, వీవీపాట్స్ భద్రతకు తీసుకుంటున్న చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ .. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్), వీవీపాట్స్ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తగిన భద్రత ఏర్పాటు చేశారని అన్నారు. ఈవీఎం గోదామును ప్రతి నెల రెవిన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి తనిఖీ చేసి, నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డా.టి. తిప్పేనాయక్, కాకినాడ అర్బన్ తహశీల్దార్ వి. జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం. జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఈవీఎం, వీవీపాట్స్ గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)