కాకినాడ : వలలో ఒకేసారి ఏకంగా 23 కెజిల భారీ పండుగప్ప చేప పడింది.. ఇంకేముంది ఆ జాలరికి రూ.16 వేలు దక్కాయి..! గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలకు ఏకంగా 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఆ చేపను యానాం మార్కెట్ కు తీసుకెళ్లి వేలం వేయగా ... కోలాటి దేవి అనే వ్యాపారి రూ.16 వేలకు ఆ చేపను దక్కించుకున్నారు. ఈ భారీ పండుగప్ప చేపను చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. రూ.16 వేలకు అమ్ముడైన ఈ చేప వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భారీ పండుగప్ప చేప పడేను - రూ.16 వేలు దక్కేను
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)