సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆవిష్కరణలతోపాటు మానవీయ విలువలూ ఉండాలి

1 రోజు క్రితం

ఆవిష్కరణలతోపాటు మానవీయ విలువలూ ఉండాలి
- విట్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్‌ కృష్ణమోహన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విట్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్‌ కృష్ణమోహన్‌

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : ఆవిష్కరణలతో పాటు మానవీయ విలువలూ ఉండాలని, నిజాయితీ, న్యాయబద్ధత, రాజ్యాంగ విలువలు, చట్ట పాలన పట్ల గౌరవం వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణ మోహన్ సూచించారు. రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయ ఆరో స్నాతకోత్సవం శనివారం జరిగింది. వర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్‌ జి.విశ్వనాథన్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ డిగ్రీ అనేది జ్ఞానం, అర్హతలను అందిస్తే, ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించాలన్నది వ్యక్తిత్వం నిర్ణయిస్తుందని అన్నారు. ఆయన గౌరవ అతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అకడమిక్ అలయన్సెస్ గ్రూప్ హెడ్‌ డాక్టర్‌ సుసీంద్రన్ కె.ఎం మాట్లాడుతూ అకడమిక్ పరిజ్ఞానాన్ని పరిశ్రమ అవసరాలతో అనుసంధానించుకోవాల్సిన ప్రాధాన్యతను వివరించారు. నిరంతర అభ్యాసం, మార్పులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడం ఎంతో అవసరమన్నారు. వైస్‌ ‌ఛాన్సలర్‌ డాక్టర్‌ పి.అరుళ్‌మొళివర్మన్‌ మాట్లాడుతూ 2026 బ్యాచ్‌లో ఉద్యోగాలు సాధించిన తమ విద్యార్థుల్లో సగటు వార్షిక వేతన ప్యాకేజీ రూ.ఏడు లక్షలు, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ రూ.96.26 లక్షలుగా నమోదైనట్లు తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన విద్య, అనుభవాత్మక అభ్యాసం, విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకునేందుకు అవకాశాలను నిబద్ధతతో అందిస్తున్నామ‌న్నారు. ఈ సంద్భంగా 3,877 మంది పట్టభద్రులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు. ఇందులో పి.హెచ్.డి – 86 మంది, బంగారు పతకాలు సాధించినవారు 31 మంది, ర్యాంకులు సాధించినవారు 133 మంది ఉన్నారు. విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, విఐటి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్.విశ్వనాథన్, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ జగదీష్ చంద్ర ముదిగంటి, అకడమిక్స్‌ ‌డీన్‌ డాక్టర్‌ ఎన్.మధుసూదనరావు, స్టూడెంట్‌ ‌వెల్ఫేర్‌ ‌డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఖాదీర్ పాషా ‌పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్