ప్రజాశక్తి- పూతలపట్టు (చిత్తూరు జిల్లా) : సర్పంచ్‌గా పోటీ చేసేందుకు తన భార్యకు టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తలుపులపల్లి పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఇదే పంచాయతీలోని అలగానిపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త గిరి (39), సర్పంచ్‌గా పోటీ చేసేందుకు తన భార్యకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు. అయితే, వారు అందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పి. కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Print Editionభార్యకు సర్పంచ్ టికెట్ ఇవ్వలేదని భర్త ఆత్మహత్య
29 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 12:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)