గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం

16 నవంబర్, 2026

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం
- స్టీల్‌‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌(సిఐటియు) హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

-- స్టీల్‌‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌(సిఐటియు) హెచ్చరిక

ప్రజాశక్తి - విశాఖ: స్టీల్‌‌ప్లాంట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్టీల్‌‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ (‌సిఐటియు) ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టీల్‌‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ.. 2012 వేతనాలతోనే కార్మికులు జీవనం సాగిస్తూ, పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2024 నుంచి వేతన బకాయిలు సుమారు రూ.900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఆర్‌ఎ నిలిపివేత, ఉక్కునగరంలో యూనిట్ విద్యుత్‌కు రూ.ఎనిమిది వసూలు, పాఠశాల ఫీజుల పెంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ​స్టీల్‌‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడు యు.రామస్వామి మాట్లాడుతూ.. వేతన ఒప్పందంపై కార్మిక శాఖ, హైకోర్టు ఒత్తిడి నేపథ్యంలో ఈ నెల 12న ఢిల్లీలో జరిగిన ఎన్‌జెసిఎస్‌ సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిందని విమర్శించారు. యాజమాన్యం నిరంకుశ వైఖరిని మార్చుకోకుంటే కార్మికులు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. ‌జివిఎంసి 105వ వార్డు సిపిఎం కార్పొరేటర్ ఎం.కృష్ణయ్య మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి.శ్రీనివాసరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్, యూనియన్‌ నాయకులు బిఎన్.మధుసూదన్, మరిడయ్య, డిఎస్‌విఎస్.శ్రీనివాస్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్