ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

If supported, Adivasis can create wonders: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ .... ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని, దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే.. మనం దేశానికి ఏమిస్తున్నామనే ఆలోచన ఉండాలని సూచించారు. నేను నా దేశం, జెండా, అజెండా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. విద్యార్థి బాగా చదివి స్టార్టప్‌ కంపెనీ స్థాపించినా దేశ సేవ చేసినట్లేనన్నారు. రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్లే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా, కుటుంబానికి, గ్రామానికి ఒక విజన్ ఉండాలని సూచించారు. ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ధింసా నృత్యం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, వారి అభ్యున్నతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని సిఎం తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తొమ్మిది ఐటిడిఎ కేంద్రాల అభివృద్ధితో మంచి ఫలితాలు వస్తాయని, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కనెక్టివిటీ సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబరు నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, టెలీకమ్యూనికేషన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుని గిరిజన గ్రామాలకు వేగంగా కనెక్టివిటీ కల్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్