ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మానవత సేవా సంస్థ చాగల్లు - కొవ్వూరు మండలానికి రాష్ట్ర స్థాయి అవార్డు - ఘన సత్కారం

1 గంట క్రితం

State-level award and grand felicitation for the Manavatha Seva Samstha (Chagallu - Kovvur Mandal).
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : మానవతా దృక్పథంతో విశేష సేవలు అందిస్తున్న చాగల్లు-కొవ్వూరు మండలం 'మానవత స్వచ్ఛంద సేవా సంస్థ' రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను, రాష్ట్ర స్థాయి కమిటీ చేతుల మీదుగా సంస్థ ప్రతినిథిగా అవార్డు మరియు సత్కారాన్ని అందుకున్న చాగల్లు-కొవ్వూరు మండలం మానవత ఛైర్మన్ జుజ్జవరపు వెంకటకృష్ణ ప్రసాద్ తాజాగా జరిగిన రాష్ట్ర , జిల్లా స్థాయి సమావేశం తాళ్ళపూడి మండలం బల్లిపాడు కాకర్ల ఫంక్షన్ హాల్లో , చాగల్లు-కొవ్వూరు మండలం మానవత విభాగం మొత్తం మూడు ప్రధాన విభాగాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

1. కఠినమైన వేసవి కాలంలో దాతల సహకారంతో వరుసగా 104 రోజుల పాటు నిర్వహించిన "ఉచిత మజ్జిగ పంపిణీ" కార్యక్రమంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కింది.

2. నూతన సభ్యుల చేరిక ద్వారా సభ్యత్వాల వృద్ధి (మొత్తం 1106 మంది సభ్యులు) విభాగంలోనూ ప్రథమ స్థానం సాధించింది.

3. అలాగే, ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహించిన నెలవారీ సమావేశాల నిర్వహణ విభాగంలో జిల్లా స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ఈ విజయాలలో కీలక పాత్ర పోషించిన చాగల్లు-కొవ్వూరు మండలం మానవత చైర్మన్ జుజ్జవరపు వెంకటకృష్ణ ప్రసాద్ ని రాష్ట్ర స్థాయి నేతలు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర మానవత సెంట్రల్ కమిటీ చైర్మన్, మానవత వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి చేతుల మీదుగా, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రయ్య మాస్టారు, జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న కండెపు సూర్యనారాయణ, మరియు తణుకు రీజియన్ చైర్-పర్సన్ బోయపాటి రామలక్ష్మి సమక్షంలో జుజ్జవరపు వెంకటకృష్ణ ప్రసాద్ ను దుశ్శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్