ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా అభయా డే

1 గంట క్రితం

Abhaya Day Celebrated Grandly
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 04:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అభయ దినోత్సవం – ఒక స్మరణ, ఒక సంకల్పం


ప్రజాశక్తి-కాకినాడ : వైద్యులు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. 2024 ఆగస్టు 9 ఆదివారం కోల్‌కతాలోని ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ లో విధుల్లో ఉన్న పీజీ వైద్య విద్యార్థిని దారుణంగా హత్యకు గురైన విషాద ఘటనను స్మరించుకుంటూ, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలనే సంకల్పం తో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయా డే కార్యక్రమం నిర్వహించారు.


అభయ దినోత్సవాన్ని వాక్‌థాన్, ప్రతిజ్ఞ, ఇంటరాక్టివ్ ఫోరం కాకినాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ ఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ .హరేంధిర ప్రసాద్ ముఖ్య అతిథి గా మూడవ అదనపు జిల్లా జడ్జ్ ఆనందిని, అడిషనల్ ఎస్పి కిషోర్ కుమార్, బిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ విశిష్ట అతిథులు గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత అభయాకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ చట్టం ప్రకారం వైద్యులు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు, చేపడతామన్నారు. మూడవ అదనపు జిల్లా జడ్జ్ ఆనందిని మాట్లాడుతూ ... ప్రస్తుత సమాజంలో భావోద్వేగాలు అధికంగా ఉన్నాయని వర్క్ ప్లేస్ లో వైద్యులు వైద్య సిబ్బంది రోగి ప్రాణాలతో పాటు వారి రక్షణ కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పి కిషోర్ కుమార్ మాట్లాడుతూ హాస్పిటల్ లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందు గా పోలీసులకు సమాచార అందించటం ద్వారా వైద్యులకు వైద్య సిబ్బంది కి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. డిఎంఇ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఆసుపత్రులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి రక్షణ కల్పిస్తున్నామన్నారు. ఆర్ ఎం సి ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషాకిరణ్ మాట్లాడుతూ డాక్టర్స్, స్టూడెంట్స్ వారి ప్రాబ్లమ్స్ చెపితే తక్షణం నివారిస్తామన్నారు. కాకినాడ గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యులు వైద్య సిబ్బంది భయం గుప్పెట్లో తీవ్ర ఒత్తిడితో పనిచేసే పరిస్థితి నెలకొందని ఏదన్న సంఘటన జరిగినప్పుడు పేషెంట్ తరఫున వచ్చేవారు ఏం చేస్తారని భయం దుప్పట్లో ఉండవలసి వస్తుందని ప్రభుత్వం వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. జూడాక్టర్స్ తరపున డాక్టర్ హరికృష్ణ, నర్స్ లు తరపున విజయ లక్ష్మి మాట్లాడుతూ వారి ప్రాబ్లమ్స్ వివరించారు. డాక్టర్ ఫణికిరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్