మధ్యప్రదేశ్ : ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నవార్ సమీపంలోని పంచక్ వాసా వద్ద ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కారును లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు, ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందించారు. ఉజ్జయిని నుంచి వస్తున్న లారీ ప్రమాదవశాత్తూ కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. వారంతా గుజరాత్ వాసులేనని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ పేర్కొన్నారు.
Madyapradesh - ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 09, 2026, 04:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)