అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా సిఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమయ్యింది. సచివాలయం మొదటి బ్లాక్ లో జరుగుతున్న ఈ భేటీలో దాదాపు 55 కు పైగా అజెండా అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గం కీలకంగా చర్చించనుంది. కేబినెట్ భేటీ అనంతరం బీసీలకు స్థానిక సంస్థల్లో 33.50 శాతం, పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జిఒ జారీ చేయనుంది. బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలి ? అన్న కోణంలో మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కమిషన్ నివేదికను అమలుచేస్తే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ వీలుపడదు కాబట్టి, ప్రత్నాయ్నాయాలేంటి ? అన్న విషయంలో లోతుగా చర్చించనున్నట్టు సమాచారం. పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్మానానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనుంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా ఎపి కేబినెట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)