మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లాలో ఐ కోర్టు తీర్పును లెక్కచేయని ఐసిడిఎస్ అధికారులు

1 గంట క్రితం

ICDS officials in the district disregard the High Court verdict.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఐ సి డి ఎస్ అధికారులు పై కోర్టు ధిక్కరణ కేసు తో పాటు ప్రత్యక్ష ఆందోళన చేపడతాం

సి ఐ టి యు జిల్లా కార్యదర్శి టి వి రమణ


ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లాలో ఐ సి డి ఎస్ తీర్పును లెక్క చేయడం లేదు హై కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు,లేకుంటే హై కోర్టులో మరల కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో పాటు ,అంగన్వాడీ ల తో ప్రత్యక్ష పోరాటం చేపడతామని సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి టి వి రమణ తెలిపారు. మంగళవారం స్థానిక ఎన్ పి ఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .... ఇటీవల కాలంలో జిల్లాలో గజపతినగరం ప్రాజెక్ట్ లో గల రామన్నపేట గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న ఆయా మానాపురం సౌజన్యను ఏప్రిల్ 28 న విధుల నుంచి తొలగించారు. గంట్యాడ ప్రాజెక్ట్ రామవరం 3 సెంటర్ లో వర్కర్ గా పనిచేస్తున్న పి. కాసులమ్మ నీ మే 15 న తొలగించాలన్నారు. వీరు ఇరువురూ తొలగించాడు అన్యాయం అని చెప్పి అధికారులను ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హై కోర్టు ను ఇద్దరు ఆశ్రయించారన్నారు. హై కోర్టు విచారణ అనంతరం వీరిద్దరినీ తొలగించడం సరైంది కాదని భావించిందన్నారు. తొలగింపు ఉత్తర్వులను హై కోర్టు రద్దు చేసి, ఇద్దరిని విధుల్లోకి తీసుకోవాలనీ హై కోర్టు తీర్పును ఇచ్చిందన్నారు. సౌజన్య విషయంలో జూన్ 15 న ఆదేశాలు జారీ చేసిందన్నారు. కాసులమ్మ విషయంలో జూలై 2 న కోర్టు తీర్పును ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజుకి సుమారుగా రెండు నెలలు దాటిందన్నారు. అయిన ఈ రోజుకి హై కోర్టు తీర్పును అమలు చేయలేదన్నారు. ఇప్పటికి అమలు చేస్తారో,ఉద్యోగాలు ఇస్తారో కూడా ఐ సి డి ఎస్ అధికారులు చెప్పడం లేదన్నారు. న్యాయస్థానం తీర్పును అమలు చేస్తూ విధుల్లోకి తీసుకోవాలని తీర్పు కాపీతో పాటు వినతి పత్రం కూడా అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు. సి ఐ టి యు తరుపున యూనియన్ గా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు.అయినా తీర్పును అమలు చేయడం లేదన్నారు. ఎటువంటి తప్పు లేకుండా కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తొలగించారన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకపోవడం వలన కోర్టు ధిక్కరణ కేసుకు వెళ్లనున్నామని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ లు పదే రోడ్డు మీదకు రావడం కారణం జిల్లావి మరో 8 కేసులు హై కోర్టులో పెండింగ్ ఉన్నాయన్నారు. జీవో లు , కోర్టు తీర్పు అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం అధికార పార్టీకి లొంగిపోవడం వలన అమలు చేయడం లేదన్నారు. అందువలనే అధికారులు వైఖరి కారణంగా రోడ్డు మీదకు రావాల్సి వస్తుందన్నారు. వెంటనే హై కోర్టు తీర్పును అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో పాటు , ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కె సురేష్,నాయకులు బి.సుధారాణి, సి హెచ్ వెంకటేష్ లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్