ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి తరం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన ఆనందంతో పాటు దేశ విభజన సమయంలో కోట్లాది మంది అనుభవించిన విషాదాన్ని కూడా మరచిపోకూడదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఈ తరానికి అతిపెద్ద బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు విదేశీ పాలకులతో పోరాడితే, నేడు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ అధికారాన్నే పరమావధిగా భావించే మనస్తత్వాలతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాంటి వారికి ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్పాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా అథోగతి పాలైందో అందరూ చూశారని అన్నారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ వేపాడ చిరంజీవి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రాష్ట్ర కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా, శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యులు ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)