శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జెండాకు అవమానం

2 గంటల క్రితం

prakasam-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెత్త బుట్టలో ఎగురుతున్న జాతీయ జెండా

ప్రజాశక్తి -కొండపి : ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగల జరుపుకునే వేళ జాతీయ జెండా పట్ల పలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. త్యాగధనుల స్ఫూర్తితో జాతీయ జెండాను ఎగరవేసి అత్యంత వైభవంగా జరపాల్సిన సమయంలో అధికారులు కనీసం జెండా ఎగరవేయాలన్నా ఆలోచన మర్చిపోయారు. భావి భారత పౌరులకు స్వాతంత్ర్య దినోత్సవ త్యాగాల గూర్చి తెలియజేయాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మండల విద్యాశాఖ కార్యాలయం పై పంచాయితీ వారు చెత్త బుట్టలో జాతీయ జెండాను ఉంచి మమ అనిపించారు. అదేవిధంగా డి ఆర్ డి ఏ వెలుగు కార్యాలయం ముందు కూడా జాతీయ జెండాను ఎగరవేయక పోగా కార్యాలయ ప్రహారీకే చెత్తబుట్టలో జెండాను పుల్లకు అమర్చి వదిలివేశారు. జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా వారం ముందు నుంచే పవిత్రమైన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి వేడుకొలను జరుపుకోవాలని ఆయా వేడుకలు ప్రజలు సన్నద్ధం చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముందుగానే పిలుపునిచ్చారు. అయినప్పటికీ అధికారులు చలనం లేకపోగా జాతీయ జెండా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం తీవ్ర విమర్శలకు తలపిస్తుంది. జాతీయ జెండాకు అవమానం జరిగిందంటే స్వాతంత్ర్య పోరాట త్యాగధనులను అవమానపరచినట్లుగానే భావించాల్సి ఉంటుందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారులలోనే ఇంత నిర్లక్ష్యం కొరవడితే ఇంకా సామాన్యుడికి ఏమి ఆదర్శంగా ఉంటారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నిర్లక్ష్య వైఖరికి పాల్పడిన అధికారులపై ఉన్నత అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే అని ప్రజలు అనుకుంటున్నారు.



prkasam

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్