శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలో కరువు పట్టదా...?

6 రోజుల క్రితం

vadde
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వాన్నిప్రశ్నించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ​రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ ‌చేశారు. ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం విజయవాడలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగు, సాగునీరు లేక రైతులు, గ్రామీణ, పట్టణవాసులు తాగునీరు లేక విళవిళలాడుతున్నా ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. రిలయన్స్, గూగుల్ డేటా, సోలార్ కంపెనీలకు, రాజధాని అమరావతికి వేల ఏకరాలు రైతుల భూములను గుంజుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతులకు సాగునీరు అందించటంలో లేదని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, పంటలు వేసుకునే అవకాశం లేక, వేసిన పంటలు ఎండిపోవటంతో, రైతాంగం తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడుతూ.. భూ సేకరణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి భూములు లాగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. 50 శాతం రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, రైతాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రైతు సంఘాలు, దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ కోరారు.. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, ప్రభాకర్ రెడ్డి, ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్