మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సర్పంచ్ ఎన్నికల్లోనూ చంద్రబాబు తలదూర్చటం సిగ్గుచేటు

2 రోజుల క్రితం

pancha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 08:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సర్పంచ్ ఎన్నికల్లోనూ సిఎం చంద్రబాబు తలదూర్చటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్టే సర్పంచ్ ఎన్నికల్లోనూ టిడిపి నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. కూటమి పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వారికి ఏకగ్రీవం చేస్తున్నారని, పోలీసులు, ఎన్నికల అధికారులు ఆ డబ్బును పంచుకుంటున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా పాలపాడులో టిడిపి అసంతృప్తి నేతతోపాటు వైసిపి నేతలను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి స్వయంగా వైసిపి వారికి ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారన్నారు. టిడిపి నాయకులను పక్కన పెట్టుకుని వైసిపి నామినేషన్ పత్రాలను పోలీసులు చించారన్నారు. ఇలాంటి వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసిపి నాయకులపై దాడులకు దిగారన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్