శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారులకు జగన్‌ అభినందనలు

5 రోజుల క్రితం

Government schools are empty... Where are the 5.56 lakh students? : YS Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌‌లో పోస్ట్‌ ‌చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్న‌తి తీసుకురావాలనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని తెలిపారు. మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఓఎన్‌జిసి పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, పిల్లల భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్