ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు చోట్ల రీపోలింగ్ : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా

1 గంట క్రితం

Maidukuru municipal election postponed: SEC Anil Chandra Punetha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నివేదిక ఆధారంగా మూడు చోట్ల, (నాలుగు పోలింగ్ కేంద్రాల్లో) రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధి 23 వార్డులోని రెండు పోలింగ్ బూత్లో, ప్రకాశం జిల్లా చీమకుమర్తిలోని 14 వార్డులోని ఒక బూత్, అనంతపురం నగరపాలక సంస్థ 30వ డివిజన్లో ని పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనాలుగు కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని. ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఈనెల 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్