ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నామినేషన్ల దాఖలు తీరు, పోటీ చేసే ప్రాంతాల్లో పరిస్థితులపై జనసేన పార్టీ సమీక్ష నిర్వహించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీల సమావేశం ఆదివారం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్ సూచించిన అంశాలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిటీ సభ్యులకు వివరించారు. నామినేషన్ల దాఖలు తీరుతోపాటు పార్టీ పోటీ చేసే ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Print Editionస్థానిక ఎన్నికల వ్యూహంపై జనసేన సమీక్ష
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 08:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)