శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిడిపి కార్యాలయం ఎదుట జనసేన, బిజెపి కార్పొరేటర్ అభ్యర్థుల ధర్నా

2 రోజుల క్రితం

ప్రోస్ట్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 11:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసీపీకి కోవర్ట్ గా పని చేస్తున్నారని మండిపాటు

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్: దక్షిణ నియోజకవర్గం 36, 39 వార్డు నుండి కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి కార్పొరేషన్ ఎన్నికలలో ఓటమి చెందిన జనసేన, బిజెపి అభ్యర్థులు తమ అనుచరులతో గురువారం రామ్ నగర్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ధర్నా నిర్వహించారు. తెలుగుదేశంతో పాటు, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలలో ఒక్కసారిగా ఈ పరిణామం విస్మయం కలిగించింది. దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సీతంరాజు సుధాకర్ తీరు వల్ల ఎన్నికలలో తాము ఓటమి చెందడం జరిగిందని, ఈ రెండు చోట్ల తమను ఓడించేందుకు సుధాకర్ ప్రయత్నించి, కూటమి ధర్మాన్ని తుంగలో తొక్కారని 36వ వార్డు జనసేన అభ్యర్థి భర్త, మాజీ కార్పొరేటర్ జనసేన నాయకుడు మహమ్మద్ సాదిక్ ఆరోపించారు. సీమంతాల సుధాకర్ గా అందరూ పిలిచే సీతంరాజు సుధాకర్ ఒక చీడపురుగు వంటి నాయకుడని, వైసీపీకి కోవర్ట్ గా పని చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధినేత దీనిని గుర్తించి తక్షణం మేలుకోవాలని, సుధాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 39వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జోగా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ, కూటమి ధర్మానికి భిన్నంగా 39 వ వార్డులో తెలుగుదేశం రెబల్ అభ్యర్థి బత్తిన నవీన్ ను పోటీలో నిలపడంలో, ఆయనను ప్రోత్సహించడంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్ పాత్ర ఉందని ఆరోపించారు. సుధాకర్ చేసిన కుట్ర కారణంగా తాను ఎన్నికల్లో ఓటమి చెందినవారు. సుధాకర్ ను టిడిపి నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్