- పవన్ కల్యాణ్ ఆమోదం
- రెండు కార్పొరేషన్లు. 12 మున్సిపాలిటీలకు అభ్యర్ధులు వెల్లడి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. రెండు నగరపాలక సంస్థలు, 12 మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ శనివారం ప్రకటించింది. కార్పొరేషన్లలో.. ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయనున్నారు. మున్సిపాలిటీల్లో.. అమలాపురం నుంచి నల్లా శ్రీధర్, చిలకలూరిపేట నుంచి తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు నుంచి కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం నుంచి కొత్తపల్లి శైలజ, నిడదవోలు నుంచి కల్లం జ్యోతి, పెడన నుంచి మట్టా శివపావని, పిఠాపురం నుంచి డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు నుంచి డి ఏలుమలై, సాలూరు నుంచి గొర్లె విజయకుమారి, సామర్లకోట నుంచి పిట్టా జానకి రామారావు, తెనాలి నుంచి తోటకూర వెంకట రమణారావు, తిరువూరు నుంచి పి మాధవి బరిలో నిలవనున్నారు. కూటమి పోత్తులో భాగంగా జనసేనకు నాలుగు మేయర్ పదవులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు 21 కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి పార్టీ తొలి జాబితాను విడుదల చేయడంతో తదుపరి జాబితాపై ఆసక్తి నెలకొంది.








కామెంట్లు (0)