శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపటి నుంచి జాషువా సాంస్కృతికోత్సవాలు

1 గంట క్రితం

jashuva
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ప్రతినిధి : తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగ మహా వైతాళికులు గురజాడ అప్పారావు జయంతి సందర్బంగా ఈ నెల 21వ తేదీ నుండి ఈ నెల 28వ తేదీ వరకూ విజయవాడలో పలు విభిన్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను జాషువా సాంస్కృతిక వేదిక నిర్వహించనుంది. ‘‘ప్రతి రోజూ వైవిధ్యం.. సాంస్కృతిక విందు’’ మకుటంతో నిర్వహిస్తున్న ‘‘జాషువా’’ పదో సాంస్కృతిక ఉత్సవాల వివరాలను శనివారం మీడియా సమావేశంలో వేదిక ప్రధాన కార్యదర్శి పి ఐజాక్ న్యూటన్ వెల్లడించారు. ‘‘21న దుర్గాపురంలోని పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య, సంగీత కళాశాలలో వేల గొంతులచే ‘‘దేశమును ప్రేమించుమన్నా’’ దేశభక్తి గీతాలాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22న ప్రఖ్యాత శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ 104 వ జయంతి సందర్భంగా బాలోత్సవ భవన్‌‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తారు. 23న తెలుగు భాషోద్యమ నేత గిడుగు రామ్మూర్తి పంతులు 164వ జయంతిని పురస్కరించుకొని బాలోత్సవ భవన్‌‌లో ఆర్ట్ గ్యాలరీ, బహుమతి ప్రదాన సభ జరుగుతుంది. 24న భారతదేశ ప్రియ పుత్రుడు షహీద్ భగత్ సింగ్ 120వ జయంతిని పురస్కరించుకొని ఎంబివికెలో జానపదం, వెస్ట్రన్ డ్యాన్స్ కార్యక్రమాలు జరుగుతాయి. 26న అలనాటి ప్రముఖ అభ్యుదయ నాటకకర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం 159వ జయంతి సందర్భంగా ఎంబివికెలో ‘కదలిక’, ‘మమ్మల్నీ బతకనివ్వండి’ నాటికల ప్రదర్శన ఉంటాయి. 27న ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని ‘‘లెజెండ్’’ ఎస్ జానకి స్మృతుల్లో భాగంగా ఎంబివికెలో పదో షార్ట్ ఫిల్మ్ పోటీలు జరుగుతాయి. 28న జాషువా 132వ జయంతి సందర్భంగా ఎంబివికెలో జాషువా స్మారక ఉపన్యాసం, బాలల వీధి నాటికల ప్రదర్శన జరుగుతుంది’’ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనని ఐజాక్ చెప్పారు. మీడియా సమావేశంలో ‘‘జాషువా’’ బాధ్యులు పి అజయ్, ఇ భాగ్యరాజ్, బెజవాడ నాని, జగదీష్, సుహాసిని పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్