శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విలేకరిపై దాడిలో ప్రధాన నిందితుడు అరెస్టు

3 రోజుల క్రితం

విలేకరిపై దాడిలో ప్రధాన నిందితుడు అరెస్టు
- మిగతా వారిపై నాన్‌‌బెయిలబుల్‌ కేసు నమోదు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మిగతా వారిపై నాన్‌‌బెయిలబుల్‌ కేసు నమోదు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : డి పట్టా భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు రాసిన ప్రత్తిపాడు మండల ప్రజాశక్తి విలేకరి ఎస్.రమేష్‌పై దాడికి పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడు మాగాపు గణపతిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్నిప్రకాష్, దాలే సతీష్, భారత్ రాఘవపై నాన్‌ బెయిలబుల్‌ ‌కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీన్‌ ‌రీక్రియేషన్‌ ‌చేశారు. అక్కడే విలేకరి రమేష్‌, ప్రజాశక్తి సహోద్యోగి ఇస్సాకు నుంచి వివరాలు సేకరించి స్టేట్‌‌మెంట్లను రికార్డు చేశారు. దాడిలో గాయపడిన రమేష్‌ ప్రత్తిపాడులోని ప్రయివేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రమేష్‌‌ను ఎపిడ‌బ్ల్యుజెఎఫ్ రాష్ట్ర నాయకులు ఎమ్.డి.అధికారి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ముమ్మిడిలక్ష్మణ్, కోశాధికారి పి.రామకృష్ణ పరామర్శించారు. ​దాడిని నిరసిస్తూ కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో విలేకర్లు నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని తహశీల్దార్, ఎస్ఐలకు వినతిపత్రాలు అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్