శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్‌ కల్యాణ్‌ని పరామర్శించిన పలువురు ప్రముఖులు

3 గంటల క్రితం

pawan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని శుక్రవారం డిప్యూటీ స్పికర్‌ రఘురామకృష్ణ రాజుతోపాటు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ కలిసిన వారిలో శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు తాతంశెట్టి నాగేంద్ర, గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది అశ్విన్ కుమార్, మహా న్యూస్ సిఎండి మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సిఎండి బండి రఘువీర్ శ్రీనివాస్, సిఇఓ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్