- ఎమ్‌ఇఒల వన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యాశాఖలో పనిచేస్తున్న మండల విద్యాశాఖ అధికారి వన్ (ఎమ్‌ఇఒ)ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్‌ఇఒ వన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు అసోసియేషన్ తరపున లేఖను పంపినట్లు పేర్కొన్నారు. జిఓ 89 ద్వారా ఎమ్‌ఇఒ 1,2 కు ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ను అందించారని తెలిపారు. ఇందుకు భిన్నంగా చాలా జిల్లాల్లో డిఇఒలు వివిధ రకాల పనులను వీరికి కేటాయించడం, విద్యాశాఖ సమీక్షల్లో జాబ్ చార్ట్ ప్రకారంగా కాకుండా అన్నీ అంశాలపై ఎంఇఒలను బాధ్యులుగా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎంఇఒ వన్ లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించకపోవడంతో పరిపాలనాపరమైన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఎంఇఒలప్రధానంగా వన్ లకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో వాహన సౌకర్యం కల్పించాలని కోరారు.








కామెంట్‌లు (0)