గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబెయిల్‌ ఇవ్వండి

1 గంట క్రితం

lella
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 07:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హైకోర్టులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్

ప్రజాశక్తి-అమరావతి : గుంటూరు, నల్లపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎవరినీ కొట్టలేదని, బెదిరించలేదని, బ్యాలెట్‌ బాక్సును లాక్కోలేదని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాలెట్‌ బాక్సును మరో బస్సులోకి మారుస్తున్నారన్న సమాచారంతో అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారని, వారి తరపున శాంతియుతంగా నిరసన తెలిపానని పేర్కొన్నారు. రిమాండ్‌ రిపోర్టులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొనడం సరికాదన్నారు. ఈ కేసులో పోలీసు కస్టడీ ఇప్పటికే ముగిసిందని, సాక్షులుగా ఉన్న అధికారులు, పోలీసుల వాంగ్మూలాల నమోదు కూడా పూర్తయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వయసు 60 ఏళ్లని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని వివరించారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కింది కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్