మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎంపి గురుమూర్తి పిటిషన్‌ ‌డిస్మిస్‌

2 గంటల క్రితం

sai krishna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వైసిపి ఎంపి గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. డిజిపి, విజయవాడ పోలీసు కమిషనర్‌ సహా పలువురు ఉన్నతాధికారులను కూడా దర్యాప్తులో చేర్చేలా ఆదేశాలివ్వాలని ఆయన న్యాయ స్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏవైనా అభ్యంతరాలు, అభ్యర్థనలు ఉంటే హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. దీంతో గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు.. ఈ కేసు దర్యాప్తును ఇప్పటికే సిబిఐకి హైకోర్టు బదిలీ చేసిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్